Money Plant | మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచేవారు తప్పక ఇది తెల్సుకోండి,

allroudadda

Money Plant  | మనీ ప్లాంట్‌లు ఆకుపచ్చని ఆకులతో మాత్రమే ఉంటాయని అందరూ అనుకుంటారు. అయితే వీటిలో అందమైన పువ్వులు పూసే మొక్కలు కూడా ఉంటాయట. తెలుపు, క్రీమ్ కలర్‌లో ఉండే పువ్వులు గబ్బిలాలు, తేనెటీగల్ని ఆకర్షించే వాసనతో ఉంటాయట. మనీ ప్లాంట్ రసం చాలా విషపూరితమైనదట. కాబట్టి ఈ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉంచాలి

మనీ ప్లాంట్స్‌ని గదిలో ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఆగ్నేయ దిశలో యజమాని గణేశుడు..పాలించే గ్రహం శుక్రుడు. గణేశుడు యజమానిని కష్టాల నుంచి కాపాడతాడని సంపద, శ్రేయస్సు కలిగిస్తాడని అందరూ నమ్ముతారు. మనీ ప్లాంట్ గురించి విచిత్రమైన అంశం ఏంటంటే ఈ మొక్క ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే వేరొకరి ఇంట్లో నుంచి దొంగిలించాలని చెబుతారు. ఇది విచిత్రంగా అనిపించిన వాస్తవమట. కానీ వాస్తు శాస్త్రం మాత్రం దీనిని అంగీకరించదు.

Also Read : గుప్పెడంత మనసు సీరియల్ నటిలో ఎన్ని అందాలు ఉన్నాయా..

పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి.

allroudadda
allroudadda

Money Plant : ఖచ్చితంగా మనీ ప్లాంట్‌ని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకోవాలట.మనీ ప్లాంట్ ప్యూరీ ఫైయర్‌గా పనిచేస్తాయి. కలుషితమైన గాలిని శుద్ధి చేస్తాయి. ఈ మొక్కలు ఏ సీజన్‌లో అయినా పెరుగుతాయి. నిర్ధిష్టమైన వాతావరణ పరిస్థితులు వీటికి అవసరం లేదు. ఇతర మొక్కలతో పోలిస్తే మనీప్లాంట్లు ఎక్కువకాలం బ్రతుకుతాయట. ఈ మొక్కలకు డైరెక్ట్‌గా సూర్యకాంతి అవసరం ఉండదు. ఇవి మట్టిలేకపోయినా నీటిలో కూడా పెరుగుతాయి. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమీ లేకపోయినా ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి.

Also Read : ‘సలార్’ నటించిన ఈ కుర్రాడు బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.

Leave a Reply