మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలిస్తే అస్సలు వదలరు..!

మృగశిర వచ్చిదంటే చాలు ఆ కార్తె ప్రవేశం రోజు ప్రతి ఇంటా చేపల కూర ఘుమ ఘుమలు గుప్పుమంటాయి. ఒక ఫ్రై, మరో దిక్కు పులుసు చేప కూరలో ఎన్ని రకాల వంటలు ఉంటాయో అన్ని చేసుకుంటూ ఉంటారు. ఆరోజున ఎప్పుడూ తినని కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కనీసం రెండు ముక్కలైనా నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు.

అసలు దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి.. చల్లబరిచే మృగశిర మొదలవుతుంది. మృగశిర కార్తె అంటే.. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి.

వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మీక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి. మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనిషి శరీరంలో మార్పులు జరిగి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. గుండెజబ్బులు, ఆస్తమా తదితర ఆనారోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాల్సిందే.

చేపలలో పోషకాలు:


చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.