Naga Babu | మరోసారి మంత్రి రోజాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు .

allroudadda

Naga Babu | ఇటీవల ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చిన సంగతి తెలిసిందే. పలువురు మంత్రులు కూడా ఈసారి ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉందని సీఎం నిర్ణయంతో స్పష్టమైంది. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ప్రజల్లో ఉంటూ కష్టపడి పనిచేసిన వారికి సొంత నియోజకవర్గం సీట్లు ఎక్కడికీ పోవని, వారి సీట్లు వారికే ఉంటాయని అన్నారు.

మంత్రుల విషయానికొస్తే, తమ నియోజకవర్గంలో బలంగా ఉంటారు కాబట్టి, ఒకవేళ వారిని ఇతర నియోజకవర్గానికి మార్చినా ఆ రెండు నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత ఆ మంత్రులకు అప్పగించడం అనేది అందరికీ తెలిసిందేనని వివరించారు.”ఇక ఎవరికైనా ఈసారి ఎన్నికల్లో సీటు లేదు అంటే అది వారి పొరపాటే అవుతుంది. నాలుగున్నర సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చారు.

Naga Babu | వైసీపీ కాలి అవుతుంది…

allroudadda
allroudadda

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రజల వద్దకు వెళ్లే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం గురించి సీఎం జగన్ చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు… నాకు మిమ్మల్ని ఎవర్నీ వదులుకోవడం ఇష్టంలేదని, మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పారు. నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎంత కష్టమైనా కూడా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాను… ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను…

Also Read : సీనియర్ నటి రమప్రభ అల్లుడు టాలీవుడ్ స్టార్ హీరో అని తెలుసా..

మీరు కూడా మీ మీ నియోజకవర్గాల్లో మీపై చెడు అభిప్రాయం లేకుండా చూసుకోండి… ప్రజల్లో ఉండండి అని జగన్ చెప్పారు. జనసేన పార్టీ నేత నాగబాబు శనివారం తెనాలి నియోజకవర్గం జన సైనికులు వీర మహిళల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన వచ్చేతరాల కోసం పెట్టిన పార్టీ అని అన్నారు. ఎన్నికలలో వెంటనే గెలవాలని పెట్టిన పార్టీ కాదని వ్యాఖ్యానించారు.త్వరలో వైసీపీ కాలి అవుతుంది.. నామీద ఎక్కువ మాట్లాడినా రోజకే దిక్కు లేదు అని నవ్వుతూ అన్నారు.

https://youtu.be/3LOTDu9B86U

Leave a Reply