దసరా హిట్‌తో రెమ్యూనరేషన్ పెంచిన నాని…! ఎన్ని కోట్లో తెలుసా,

కొన్ని రోజుల క్రితం నాని నటించిన ‘దసరా’ సినిమా విడుదల అయింది. ఇది నాని కెరీర్ లో పెద్ద సినిమా అని అంటున్నారు. ఈ సినిమాకి నాని సుమారు రూ.16 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్టుగా పరిశ్రమలో అంటున్నారు. అయితే ఈ సినిమా విజయం సాధించాక, నాని తన పారితోషికాన్ని మళ్ళీ పెంచాడని ఒక టాక్ నడుస్తోంది.ఇప్పుడు నాని తన తదుపరి సినిమాకి సుమారు రూ.20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు పరిశ్రమలో వినపడుతోంది.

తన సినిమాలు పాన్ ఇండియా పరిధిలో విడుదల అవుతున్నాయని, అన్ని సినిమాలు ఓ.టి.టి, అలాగే శాటిలైట్ హక్కులు కి కూడా మంచి డిమాండ్ ఉండటంతో పారితోషికం పెంచడంలో తప్పు లేదన్నట్టుగా టాక్ నడుస్తోంది.నాని ఒక డిమాండ్ లో వున్న నటుల్లో ఒకడు. అతని సినిమాలు టాక్ ఎలా వున్నా నిర్మాత పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది అని కూడా పరిశ్రమలో అంటున్నారు.

అలాంటప్పుడు నాని తో సినిమాలు చెయ్యడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు. అదీ కాకుండా నాని తొందరగా కూడా సినిమా పూర్తి చేస్తాడు. వీటన్నిటివల్లా అతను బాగా డిమాండ్ లో వున్నాడు. అందువల్ల పారితోషికం పెంచాడు అని కూడా వినిపిస్తోంది. ఇటు దసరా మూవీ కూడా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ఇండియాలోనే కాక.. అమెరికాలో కూడా రికార్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి.

Leave a Reply