నరాల బలహీనతకు శాశ్వత పరిష్కారం ఇవే..!

రోజు వ్యాయామం ద్వారా నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే ఎవరు లేని చోట కూర్చొని ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చి.. అలాగే కనీసం 1-2 నిముషాల వరకు పట్టి ఉంచి ఆ తరువాత నెమ్మదిగాగ్ ముక్కు ద్వారా వదిలెయ్యలి.. ఇలా రోజుకు కనీసం 10-20 నిముషాలు చేయడం ద్వారా ఈ నరాల బలహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. అయితే నరాల బలహీనత సమస్యతో బాధపడే వాళ్ళు ఈ చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే సరిపోతుంది.

ఎప్పుడూ కూడా చిన్న సమస్యలనైనా పెద్ద సమస్యలనైనా నెగ్లెక్ట్ చేయకూడదు ఇది మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. పైగా సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నరాల బలహీనత సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం ఈ విధంగా అనుసరించాలి. మెదడు వెన్నుపాము నుండి శరీరంలో వివిధ భాగాలకు సందేశాలని నరాలు తీసుకువెళతాయి దీన్ని నాడీ వ్యవస్థ అంటారు. శ్వాసక్రియ జీర్ణక్రియ ఉష్ణోగ్రత నియంత్రణ వంటి వాటికి నాడి వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

నాడీ వ్యవస్థని కనుక మీరు బలంగా మార్చుకోవాలంటే వీటిని కచ్చితంగా డైట్ లో చేర్చుకోండి. పసుపు..పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది మెదడు ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది ఆల్జీమర్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి వాళ్లకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఆకుకూరలు..ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నరాల బలహీనత వంటి ఇబ్బందుల్ని ఆకుకూరలు దూరం చేస్తాయి కనుక మీరు ఆకుకూరలని కూడా డైట్ లో చేర్చుకోవాలి.పాలకూర బచ్చల కూర లో మెగ్నీషియం కాపర్ వంటివి ఉంటాయి.

కనుక వాటిని డైట్ లో చేర్చుకుంటే మంచిది. ఫ్యాటీ ఫిష్..సాల్మన్, టున మొదలైన ఫ్యాటీ ఫిష్ లని కూడా డైట్ లో చేర్చుకోండి వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నట్స్..బాదం జీడిపప్పు వంటి నట్స్ ని కూడా డైట్లో చేర్చుకోండి నాడీ వ్యవస్థని ఆరోగ్యంగా మారుస్తాయి ఇవి.బెర్రీస్..వీటిని డైట్ లో చేర్చుకుంటే కూడా ఎంతో మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి ఇవి నరాలని ఆరోగ్యంగా మారుస్తాయి. జ్ఞాపకశక్తిని కూడా పెంచుకోవచ్చు. గ్రీన్ టీ..ఇది కూడా నరాల వ్యవస్థని బాగా ఉంచుతుంది. సమస్యని తగ్గిస్తుంది.

Leave a Reply