నా ఆస్తి మొత్తం ఎన్ని వేల కొట్లో నాకే తెలియదు.. నరేష్‌ కామెంట్స్

నరేష్‌‌‌‌, పవిత్ర లోకేష్ జంటగా ఎం.ఎస్‌‌‌‌ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌‌‌‌ను రీ లాంచ్ చేస్తూ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌లో నరేష్ మాట్లాడుతూ ‘జీవితంలో ఫస్ట్ ఆఫ్ కంటే సెకండాఫ్‌‌‌‌ బాగుండాలని చెప్పే కథే ఈ సినిమా. నా రీల్‌‌‌‌ లైఫ్‌‌‌‌ బాగున్నా రియల్‌‌‌‌ లైఫ్ బాగోలేదు.

ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ తర్వాత పవిత్ర ద్వారా ఇంకో అమ్మను కలుసుకున్నా. ట్రైలర్‌‌‌‌లో చూసింది కొద్దిగానే.. సినిమా విడుదలయ్యాక ఆటంబాంబ్‌‌‌‌ పేలుతుంది. తెలుగు, కన్నడ భాషల్లో తీసినా.. యు.ఎస్‌‌‌‌.ఎ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌లలోనూ విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.నరేష్‌ తాజాగా మళ్లీ పెళ్లి ప్రమోషన్‌లలో ఆస్తికి సంబంధించిన విషయాలను వెల్లడించాడు.నేను రిచ్‌ అనడంలో సందేహమే లేదు.

నేను బిలియనీర్‌ అని ఒప్పుకుంటా. మా అమ్మగారి నుంచి నాకు ఆస్తులు వచ్చాయి. నేను కూడా కష్టపడి చాలానే సంపాదించా. మేం భూముల మీద పెట్టుబడులు పెట్టాం. వాటి ధరలు బాగా పెరిగాయి. ఐతే ఎంత డబ్బు ఉంది అన్న దాన్ని బట్టి మనం ఎంత ధనవంతులం అనేది ఆధారపడి ఉండదు. ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. రోజూ ఎంత ఆనందంగా గడుపుతాం. ఉన్న డబ్బులు ఖర్చు పెడతాం. మాకు వీలైనంత మేర పది మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

Leave a Reply