Naresh :  స్టేజిమీద డ్యాన్సులు, ముద్దులతో నరేశ్ ,పవిత్ర రచ్చ రచ్చ..!

నరేష్ తెలుగు ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకు పోతున్నాడు.. కెరీర్ లో సూపర్ సక్సెస్ అయిన నరేష్ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యాడు.మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు కూడా విడాకులు ఇచ్చిన ఈయన ఇప్పుడు నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు..

గత ఐదేళ్లుగా వీరు కలిసి ఉంటున్నట్టు తెలుస్తుంది.. త్వరలోనే ఈ జంట మళ్ళీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. నరేష్ – పవిత్ర జంటగా నటించిన ఈ సినిమాలో ఆయన లైఫ్ లో చోటు చేసుకున్న యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్టు సమాచారం..ఈ సినిమా మే 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో నరేశ్ – పవిత్ర కలిసి స్టేజిపై డ్యాన్సులు వేశారు. ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకున్నారు. నరేశ్ బొకే ఇచ్చి పవిత్ర చేతికి ముద్దు పెట్టాడు.

ఇలా ఇద్దరూ కలిసి స్టేజిపై రచ్చరచ్చ చేశారు. ఇక వీరి రిలేషన్ గురించి ఓంకార్ అడగగా.. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా కలిసే ఉంటాం అంటూ నరేశ్ ప్రేమ కవితలు చెప్పాడు. అలాగే ఈ షోలో ఓంకార్.. పవిత్రని ముద్దుగా ఏమని పిలుస్తారు అని నరేశ్ ని అడగగా.. నరేశ్ అమ్ములు అని పిలుస్తాను అని, మరింత ముద్దు వస్తే అమ్ము అని పిలుస్తాను అని చెప్పాడు. దీంతో లేటు వయసులు ఈ జంట చేసే చిలిపి సందడితో మరోసారి ఈ జంట వైరల్ అవుతున్నారు.దీనిపై మీ ఆభిప్రాయం కామెంట్ లో తెలియచెయ్యండి,

Leave a Reply