Naveen Polishetty | హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఇప్పుడు ఎలా ఉందంటే..?

allroudadda

Naveen Polishetty | యంగ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నవీన్ పొలిశెట్టి.
ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ గుర్తింపు సంపాదించుకున్న నవీన్.. గత ఏడాది టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క సరసన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

సెప్టెంబరు 7న విడుదలైన ఈ సినిమాకు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా నవీన్ పోలిశెట్టి ప్రమాదానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారట. అక్కడ బైక్ డ్రైవ్ చేస్తూ జారిపడడంతో చేతికి ఫ్యాక్చర్ అయ్యినట్లు సమాచారం. దీంతో ఆయన రెండు నెలలు పాటు రెస్ట్ తీసుకోనున్నారట. మరి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది..? అనేది తెలియాల్సి ఉంది.

allroudadda
allroudadda

ఇక ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. అభిమానులు కంగారు పడుతున్నారు. ‘టేక్ కేర్’ అంటూ నవీన్ పోలిశెట్టికి ట్వీట్స్ చేస్తున్నారు.కాగా ‘అనగనగా ఒక రాజు’ సినిమాని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ దర్శకుడు గత ఏడాది ‘మ్యాడ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నారు. మ్యాడ్ కంటే ముందే అనగనగా ఒక రాజు మూవీ రావాల్సింది. కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ కొన్ని కారణాలు వల్ల అది వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మొదలైందా లేదా అనే అప్డేట్ కూడా లేదు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.

Recent Posts

Leave a Reply