Nayanathara | నయనతార ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే..!

Nayanathara | నయనతార జవాన్ సినిమాతో నార్త్ లో కూడా రాణించడానికి రెడీ అయింది. ఈ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించింది.లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కాకుండా శ్రీరామరాజ్యం వంటి సినిమాల్లో సీత గా నటించి మెప్పించింది. అలాగే వల్లభ వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది.కోలీవుడ్లో బిల్లా సినిమాతో సెక్సీయెస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.

కర్తవ్యం,డోరా వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇక ఈమె సినిమాల్లో చాలా సక్సెస్ అయ్యింది. ఇక ఈమె తన సినిమాకి దాదాపు ఐదు నుండి 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది. అయితే బాలీవుడ్ మూవీ జవాన్ (Jawan) కోసం 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే నయనతార స్టార్ హీరోలకు మించి ఆస్తిపాస్తులు కూడబెట్టిందని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఆమె దాదాపు 180 కోట్ల వరకు ఆస్తి సంపాదించినట్టు సమాచారం. ముంబై,కేరళ, హైదరాబాద్, చెన్నై వంటి సిటీలలో ఖరీదైన బంగ్లాలు ఉండడమే కాకుండా ఈమె కార్ గ్యారేజీ లో కూడా అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి.మెర్సిడెజ్, బిఎండబ్ల్యూ, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటివి మాత్రమే కాకుండా ప్రైవేట్ జెట్ విమానం కూడా ఈ హీరోయిన్ కి ఉంది. ఇక ఈ హీరోయిన్ కేవలం సినిమాల్లోనే కాకుండా కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది.

ఇది చదవండి: తమన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

అలాగే కొన్ని కంపెనీలలో కూడా నయనతార పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.ఇక ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుండి మూసివేసి ఉన్న ఒక థియేటర్ని కూడా నయనతార కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇవే కాకుండా స్థిరాచరాస్తులు అన్నీ కలిపి దాదాపు నయనతార ఆస్తుల విలువ 180 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఇక 180 కోట్లు అంటే మామూలు విషయం కాదు. స్టార్ హీరో కూడా నయనతార (Nayanathara) కి ఉన్నన్ని ఆస్తులు సంపాదించలేడు అంటూ ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Leave a Reply