Nayanthara And Vignesh | ఆమ్మో: అప్పుడే భర్తను దూరం పెడుతున్న నయనతార..!

allroudadda

Nayanthara And Vignesh | నయనతార… ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాల్లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌కు పేరుతెచ్చుకుంది. నయన్ తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమాలో నటించి టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది.

అందులో భాగంగా.. నయన్.. తమిళ్‌లో ‘అరం’, ‘డోరా’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’, ‘కొలైయుదిర్‌కాలం’… వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నయన్ ప్రస్తుతం తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది.తాజాగా నయనతార తన భర్త డైరెక్ట్ చేస్తున్న ఎల్ఐసి సినిమా నుంచి హీరోయిన్ గా తప్పుకుందట.

allroudadda
allroudadda

సూపర్ స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ వచ్చినప్పటి నుంచి నయనతార ఒక్కో సినిమాకు సుమారు రూ. 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక తన భర్త తెరకెక్కిస్తున్న ఎల్ఐసి సినిమాలో హీరోయిన్గా చేయడానికి నయనతార ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అడిగిందట.అంత రెమ్యూనరేషన్ ఇవ్వడం తన వల్ల కాదని కాస్త తగ్గించుకోమని తన భర్త చెప్పినా కూడా నయనతార వినిపించుకోలేదట.

ఆ స్టార్ హీరో వలనే సానియా మీర్జా విడాకులు తీసుకుందా.

దీంతో అంత రెమ్యూనరేషన్ ఇవ్వడం తమ వల్ల కాదని తేల్చి చెప్పేశారట. ఇక నయనతార చాలా కోపంగా ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పి అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేసి నయనతార పంపించారట. సినిమా, పని విషయంలో భర్త అయినా, ఎవరైనా నాకు ఒకటే అంటూ నయనతార తేల్చిచెప్పేసారట. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Leave a Reply