Neha Sharma | లోక్‌సభ ఎన్నికల బరిలో ‘చిరుత’ నటి..? ఎక్కడి నుంచి అంటే.. ?

neha-sharma

Neha Sharma | రాంచరణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బీహార్ భామ నేహాశర్మ.. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ మూవీలో ఈ అమ్మడు చాలా చక్కగా నటించింది. లేడీ విలన్ స్థాయిలో రెచ్చిపోయింది. మొదటి సినిమా హిట్ అయిన వెంటనే ఈ అమ్మడికి వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. ఆ టైంకి వరుణ్ సందేశ్ ఫామ్లో ఉన్నాడు.

కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోయేసరికి ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి.దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది.అక్కడ ‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించింది కానీ అక్కడ కూడా ఈమె సక్సెస్ కాలేదు.తర్వాత తమిళ్, పంజాబీ సినిమాల్లో కూడా నటించినా లాభం లేకపోయింది. ప్రస్తుతం ఈమె ఆఫర్ల కోసం సోషల్ మీడియానే నమ్ముకుంది. అక్కడ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ కు మంచి కిక్ ఇస్తుంది.

neha-sharma
neha-sharma

అయితే తాజాగా నేహాశర్మ (Neha Sharma) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections 2024) పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.బిహార్‌ (Bihar) నుంచి ఆమెను బరిలోకి దింపాలని నేహా తండ్రి, కాంగ్రెస్‌ నేత అజిత్‌ శర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

Voter List | ఓటరు లిస్టులో మీ పేరు ఉందా, లేదా – ఇలా చెక్ చేసుకోండి..!!

”బిహార్‌లోని భగల్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. ‘ఇండియా’ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్‌కే దక్కాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సీటు మా పార్టీకి వస్తే.. నేను పోటీ చేయడం లేదా నా కుమార్తె నేహాశర్మను బరిలోకి దించాలని భావిస్తున్నా. దీనిపై పార్టీని సంప్రదిస్తున్నా. తుది నిర్ణయం హైకమాండ్‌దే” అని భగల్‌పుర్‌ ఎమ్మెల్యే అజిత్ శర్మ వెల్లడించారు.బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి.

Leave a Reply