భార్యతో ఆట పాట… దిల్ రాజుని ఎప్పుడూ ఇలా చూసి ఉండరు..!

చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి అనంతరం ప్రొడ్యూసర్ గా మారారు. ఒకప్పుడు చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాలను కూడా నిర్మాతగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన అనిత అనే మహిళను వివాహం చేసుకున్నారు.అయితే గుండెపోటుతో ఆమె మరణించడంతో ఈయన మూడు సంవత్సరాల పాటు ఒంటరిగా ఉన్న అనంతరం తన కూతురి ప్రోద్భలంతో రెండో పెళ్లి చేసుకున్నారు.అయితే ఈయన రెండో వివాహం తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని అయితే వీరిది లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ అని తాజాగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

తన భార్య అనిత మరణించిన తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను అయితే తన జీవితంలో సరికొత్త నిర్ణయం తీసుకోవాలంటే తను ఉన్న బిజీ లైఫ్ కారణంగా తనని అర్థం చేసుకునే వారి కోసం వెతుకుతున్నానుఅదే సమయంలోనే ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు తేజస్విని పరిచయమైందని,

ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు తనని గమనించిన అనంతరం తను నాకు పర్ఫెక్ట్ అని తెలుసుకున్న తర్వాతే తనకు ప్రపోజ్ చేశానని దిల్ రాజు తెలిపారు.ఇలా నేను తనకు ప్రపోజ్ చేయడం తను నా ప్రపోజల్ ఓకే చెప్పిన తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నామని ఈ సందర్భంగా దిల్ రాజు తన రెండో పెళ్లి వెనుక ఉన్న స్టోరీని బయటపెట్టారు.రీసెంట్ గా శ్రీరామనవమి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న దిల్ రాజు.. కొడుకుని ఒడిలో కూర్చో బెట్టుకుని మరీ పూజలో చేశారు. ఆ తర్వాత రాముడి పాటలు పాడటంతో పాటు, భార్యతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. తాజాగా ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Leave a Reply