Pulsar Bike Ramana | ప్రేమ పెళ్లి కోసం పల్సర్ బైక్ రమణ ఎన్ని బాధలు పడ్డాడో మీరే చూడండి.

allroudadda

Pulsar Bike Ramana | ‘నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో’ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు హుషారైన స్టెప్పులేసి కండక్టర్‌ ఝాన్సీ బాగా ఫేమస్‌ అయిపోయింది. అయితే ఈ ఫోక్‌ సాంగ్‌కు తన గొంతుతో ప్రాణం పోసింది మాత్రం ప్రముఖ జానపద కళాకారుడు రమణ. అంతకు ముందు పలు బుల్లితెర షోస్‌, ఈవెంట్లలో పాటలు పాడినప్పటికీ పల్సర్‌ బైక్‌ సాంగ్‌తోనే బాగా ఫేమస్ అయ్యాడు రమణ.

ఎంతలా అంటే ఇదే పల్సర్‌ బైక్‌ సాంగ్‌ను రవితేజ ధమకా సినిమాలోనూ వాడితే అక్కడ కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. దీంతో పాటు ‘పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో..’, ‘వస్తావా.. భాను వస్తావా..’తోనూ సంగీతాభిమానులను అలరించాడీ ఫోక్‌ సింగర్‌. తన హుషారైన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులరైన గాయకుడు రమణ శుభవార్త చెప్పాడు.

allroudadda
allroudadda

తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఇటీవలే ఈ ఫోక్‌ సింగర్‌ నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది.. అయితే కొత్త సంవత్సరంలో అతడు ఓ ఇంటివాడయ్యాడు. జనవరి 3న కుందన అనే అమ్మాయిని రమణ వివాహం చేసుకున్నాడు. త్వరలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరూ జంటగా కనిపించబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదలయింది.

చెల్లెలు నిశ్చితార్థ వేడుకల్లో సాయి పల్లవి తీన్మార్ డాన్స్…

గతంలో రమణకి లవ్ విషయంలో ఒక బ్రేకప్ జరిగింది. ఆ సమయంలో రమణ డిప్రెషన్ లోకి వెళ్ళాడు, బేబీ చిత్రం తరహాలో అతడి లవ్ స్టోరీ ఫెయిల్ అయిందట. అయితే ఆ బాధని పక్కన పెట్టేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రమణ భార్య కుందన శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన వల్ల తన కుటుంబ సభ్యుల వల్ల రమణ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని ఎమోషనల్ గా కుందన తెలిపింది.

Leave a Reply