Sania Mirza | ఆ స్టార్ హీరో వలనే సానియా మీర్జా విడాకులు తీసుకుందా.

allroudadda

Sania Mirza | పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకున్నారు అన్న వార్త గత ఏడాదిన్నర నుంచి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వీరి విడాకులకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు రావడం తప్ప ఈ ఇద్దరిలో ఒకరు కూడా ఈ విషయంపై స్పందించింది లేదు. కానీ ఇక ఎన్నో రోజుల నుంచి వీరిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమైంది.

అయితే ఇటీవలే వీడి విడాకులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఆరు నెలల క్రితమే విడాకులు తీసుకొని వేరుపడ్డాము అన్న విషయాన్ని చెప్పేశారు.అయితే సానియా మీర్జాకు విడాకులు ఇచ్చాడో లేదో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఏకంగా పాకిస్తాన్ నటి సనా జావేద్ ను మూడో వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.

allroudadda
allroudadda

అయితే 2010లో పాకిస్తాన్ క్రికెటర్ ను సానియా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు.. తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఇక విమర్శలను పట్టించుకోకుండా 2010లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చి చివరికి విడాకుల వరకు వెళ్ళింది.అయితే.. సానియా మీర్జాకు ఓ టాలీవుడ్ హీరోతో సాన్నిహిత్యం ఉంది అంటూ అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి.

 చెల్లి ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి మాస్ డాన్స్ ..!

అంతే కాదు.. వీరిద్దరూ కూడా పలు ఈవెంట్స్ లో తళుక్కున మెరిశారు కూడా. ఈ పుకార్లు ఎన్ని సార్లు వచ్చినా.. ఇటు సానియా కానీ, అటు ఆ హీరో గాని స్పందించలేదు. ఆ తరువాత ఈ పుకార్లు ఆగిపోయాయి కూడా. అయితే.. వీటి వలన కూడా షోయబ్ కు, సానియాకు మధ్య వివాదాలు వచ్చాయని రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం సానియా బాలీవుడ్ లో స్టార్ నటులతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆమె అప్పుడప్పుడు ఈవెంట్స్ లో తళుక్కుమంటుంటారు కూడా. అయితే.. ఆమెకు షోయబ్ తో విడాకులు అయిపోవడం అన్న విషయంలో మాత్రం ఆమె అభిమానులు బాధపడుతున్నారు

Leave a Reply