డబ్బు కోసం ఆయాడ్‌ని ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్..!

నిధి అగర్వాల్ కండోమ్స్‌కు ప్రచారం చేస్తూన్నారు. మీరు చదివింది నిజమే… కండోమ్స్‌కు ఆమె పబ్లిసిటీ చేస్తున్నారట.ఒక కంపెనీకి చెందిన కండోమ్స్ ఉపయోగించమని ఆమె సలహా కూడా ఇచ్చారు. ఆ కండోమ్స్‌తో ఎంతో అనుభూతి బావుంటుందని చెప్పుకొచ్చారు. అంతే కాదు, ఆ కంపెనీకి చెందిన కండోమ్ యాడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ పేజీల్లో కూడా పోస్ట్ చేశారు. నిధి అగర్వాల్ పోస్టులు చూసి చాలా మంది కూడా షాక్ అయ్యారు.మరికొంత ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేశారు.నిధి అగర్వాల్ పోస్టుల కింద కొంత మంది అసభ్యకరమైన రీతిలో, ఇక్కడ రాయలేని భాషలో పోస్టులు చేశారట.. కండోమ్స్ మీరు ఉపయోగించారా? అని కొందరు ప్రశ్నించారట.

అనుభవంతో చెబుతున్నారా? అని కొందరు వెటకారంగా కూడా అడిగారు. ఇటువంటి యాడ్స్ చేయవద్దని కొందరు సలహా కూడా ఇచ్చారు. మొత్తం మీద సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ కండోమ్స్ ప్రచారం దుమ్ము దుమారం రేపుతోందట.ఆమె విమర్శలకు గురి కావడం ఇది తొలిసారి కాదు. గతంలో ఒక లిక్కర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ… ఆమె పోస్ట్ కూడా చేశారు. అప్పుడు కూడా ఆమెను నెటిజన్స్ తెగ విమర్శించారు.సాధారణంగా నిధి అగర్వాల్ వేసుకునే దుస్తులు ఎప్పుడు విమర్శలకు కారణం అవుతూ ఉంటాయి.

అందాల ప్రదర్శన ఎక్కువ చేస్తారని కొందరు ఆమెను ట్రోల్స్ కూడా చేశారు. ఇప్పుడు మాత్రం లిక్కర్, కండోమ్స్ చేయడంతో డబ్బు కోసం ఏమైనా చేస్తారా? అంటూ కొందరు విరుచుకుపడుతున్నారట. లిక్కర్ యాడ్ పోస్ట్ చేసినప్పటి కంటే… కండోమ్ యాడ్ పోస్ట్ చేసినప్పుడు ఆమెపై వ్యతిరేకత ఎక్కువైందట.అదే సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచిన వారు కూడా ఉన్నారు. దుస్తులపై విమర్శలు వచ్చినప్పుడు నిధి అగర్వాల్ ఘాటుగా బదులు కూడా ఇచ్చారు.

ఇప్పుడు ఏం అంటారో చూడాలి.’ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి అగర్వాల్ తెలుగులో పాపులర్ అయ్యారు. అంతకు ముందు అక్కినేని హీరోలు నాగ చైతన్యతో ‘సవ్యసాచి’, అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ సినిమాలు కూడా చేశారు. తర్వాత మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తొలి సినిమా ‘హీరో’లో కథానాయికగా ఆమె నటించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్నారట.. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని నిధి అగర్వాల్ బాగా ఆశిస్తున్నారు.

Leave a Reply