Niharika: తొలిసారి విడాకుల విషయమై నోరువిప్పిన నిహారిక..!

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల విషయం.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెల్సిందే. మూడేళ్ళ క్రితం జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత నిహారిక నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు తీసి మంచి నిర్మాతగా సెటిల్ అయ్యింది. అయితే ఈ లోపే.. అనుకోని అడ్డంకులు ఆమెను చుట్టుముట్టాయి.

పబ్ కేస్ లో ఆమె పేరు రావడం సంచలనంగా మారింది. ఇక ఆ తరువాత ఆమె వైవాహిక జీవితంలో చాలా మార్పులు వచ్చాయని సమాచారం. భార్యాభర్తల మధ్య విబేధాలు.. చివరికి విడాకులు తీసుకొనేవరకు వెళ్లాయని టాక్ . అయితే వీరిద్దరూ డైరెక్ట్ గా ఈ విషయం చెప్పకపోయినా.. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో విడాకులు కన్ఫర్మ్ అయ్యినట్లు అర్ధం అవుతుంది.

ఇక విడాకులు తీసుకున్న దగ్గరనుంచి నిహారిక.. నటిగా ఫోకస్ చేయడానికి రెడీ అవుతుందని టాక్ నడిచింది. అందుకే ఆమె నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నిహారిక వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తుంది. ఇక తాజాగా ఒక ప్రెస్ మీట్ లో నిహారిక విడాకులు గురించి రిపోర్టర్ అడగగా దానికి నిహారికా మాత్రం అన్నిటికి సమయం ఉంది కొంచెం వేచి చూడాలి అంతే.. అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

Leave a Reply