ఒక్క పిక్ తో నిహారిక విడాకులు క‌న్‌ఫాం చేసిన వరుణ్ తేజ్..!

సినిమా ఇండస్ట్రీలో విడాకుల కామన్. సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తుంటాయి. నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య జంట విడిపోయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వైవాహిక జీవితం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉంది. నిహారిక Niharika Konidela 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉందనిపించుకుంది.

అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ నిహారిక, చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి.నిహారిక, చైతన్య విభేదాల వార్తలకు తగ్గటే వీరి వ్యవహారం కూడా ఉండడంతో విడాకులు కన్ ఫామ్ అని ప్రచారం ఊపందుకుంది. చైతన్య తన ఇన్ స్టా నుంచి తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం..దంపతులు ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం,

నిహారిక సైతం తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడం ఇలాంటి ఘటనలతో నిహారిక డైవర్స్ కన్ ఫామ్ అంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఐతే తాజాగా నిహారిక అన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లో నాగబాబు నివాసంలోనే ఈ వేడుక ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది.

మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వరుణ్‌-లావణ్య నిశ్చితార్థంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. అయితే నిహారిక భర్త చైతన్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఫ్యామిలీ ఫోటోల్లో సైతం నిహారిక Niharika Konidela ఒంటరిగానే దర్శనమిచ్చింది. సొంత బావమరిది నిశ్చితార్థానికి చైతన్య హాజరు కాకపోవడంతో.. అతనితో నిహారిక విడిపోయిందని నెటిజన్లు కన్ఫార్మ్‌ చేసేసుకుంటున్నారు.

Leave a Reply