Niharika : త‌ల్లి కాబోతున్న నిహారిక‌… అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిందా..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు . చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. అంతగా సక్సెస్ కాలేదు. దీంతో పెళ్లి చేసుకుని మళ్లీ ఇప్పుడు నిర్మాతగా బిజీ అవుతోంది. చాలా తక్కువ సమయంలోనే యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా నిహారిక సక్సెస్ అయిన నిహారికకి హీరోయిన్‌గా మాత్రం భారీ ఎదురుదెబ్బలే తగిలాయి.

నాగశౌర్య నటించిన ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని అందించలేదు.హీరోయిన్‌గా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సమయంలో నిహారిక సినిమాలకు విరామం ప్రకటించి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ…

తన బ్యానర్‌లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.ఇక సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. నిహారిక చివరిగా సోషల్ మీడియా పోస్ట్ డిసెంబర్ 12న పెట్టారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఏ పోస్ట్ లేదు. దీంతో నిహారిక ఆల్మోస్ట్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు కనిపిస్తుండగా పలు అనుమానాలకు దారితీస్తుంది. నిహారిక త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతుంద‌ని, ఆమె తాజాగా గ‌ర్భం దాల్చింద‌ని.. మ‌రికొద్ది రోజుల్లో నిహారిక‌-చైత‌న్య త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోట్ కాబోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

నిహారిక ప్రెగ్నెంట్ అయింది కాబ‌టటే ఆమె సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింద‌ని ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.

Leave a Reply