Niharika | నాకు జస్ట్‌ 30ఏళ్ళే.. త్వరలో రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటా.. నిహారిక

allroudadda

Niharika | మెగా డాటర్ నిహారిక (Niharika) .. పరిచయం అవసరం లేని పేరు. నాగబాబు (Naga Babu) కూతురిగా సినీ రంగప్రవేశం చేసినప్పటికీ.. అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్..లతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ‘ఢీ’ వంటి పలు షోలకు మెంటర్ గా వ్యవహరించింది. హోస్ట్ గా కూడా మారి ఈమె నాగ చైతన్య వంటి హీరోలను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.కెమెరా అంటే భయం పోగొట్టుకోవడానికి ఆమె అలాంటి షోలలో పాల్గొన్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.ఇక హీరోయిన్ గా మారి (Oka Manusu) ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ (Suryakantham)వంటి సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత కోవిడ్ రావడం, ఈమెకి పెళ్లి ఫిక్స్ అవ్వడం జరిగింది. పెళ్ళైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లోనే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళు ఈమె ఫ్యామిలీ లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేసినప్పటికీ.. తర్వాత ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంది.ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. ఓ పక్క వెబ్ సిరీస్..లు వంటివి నిర్మిస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా నిర్మిస్తుంది.

allroudadda
allroudadda

ఇదిలా ఉండగాతాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి, విడాకుల తీసుకున్న తర్వాత వాటి గురించి తొలి సారి స్పందించారు. జీవితంలో పెళ్లి, విడాకులు అనేవి చిన్న విషయాలు కావని, అయినా ఆ సమయంలో తాను ఎలాంటి కఠిన పరిస్థితి ఎదుర్కొన్నానో తనకు మాత్రమే తెలుసని, చూసేవారికి ఏం తెలుసని అన్నారు. అలాంటి టఫ్‌ కండీషన్‌లో తనకు కుటుంబం విలువేంటో తెలిసొచ్చిందని కూడా నిహారిక పేర్కొన్నారు.

allroudadda
allroudadda

ఆ సమయంలో తల్లిదండ్రులు మాత్రమే మన కోసం నిలబడతారని తెలిపారు. విడాకుల సమయంలో తన తండ్రి నాగబాబు చాలా సపోర్ట్‌ చేశారని వెల్లడించారు. అయినా ఎవరూ కూడా పెళ్లి పెటాకులు అవుతుందని చేసుకోరని, కానీ, కొన్ని సార్లు అలా జరిగిపోతుందని అన్నారు.అలాగే మళ్లీ పెళ్లి చేసుకోవడంపై కూడా నిహారిక స్పందించారు. జీవితంలో నెక్ట్స్‌ ఏంటని హోస్ట్‌ నుంచి వచ్చిన ప్రశ్నకు.. నిహారిక బదులిస్తూ.. హోప్‌ ఫుల్లీ, తనకింకా 30 ఏళ్లు మాత్రమే అంటూ బదులిచ్చారు. రెండో పెళ్లి చేసుకోవడానికి తనకేమి అభ్యంతరం లేదని, చేసుకోవద్దని బలంగా ఫిక్స్‌ అవ్వలేదనే విషయాన్ని నిహారిక స్పష్టం చేశారు.

మళ్లీ పెళ్లి చేసుకుని, వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు వెల్లడించారు. తన హృదయాన్ని ముసివేయలేదని చెప్పి నవ్వులు పూయించారు. అలాగని.. పెళ్లి కోసం తాను పరుగులు పెట్టడం లేదని, ఎవర్ని చేసుకోవాలని ఎవర్ని చేసుకోవాలంటూ తాను పెళ్లి వెంట పడననని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకుంటానని కూడా ఈ సందర్భంగా నిహారిక స్పష్టం చేశారు. చాలా మంది విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి గురించి మాట్లాడితే.. ఛీ ఛీ మళ్లీ పెళ్లి జోలికి వెళ్లం, అలాంటి తలనొప్పిని భరించాలని తమకు లేదని అంటూ ఉంటారు. కానీ, నిహారిక మాత్రం ఎంతో హుందాగా, మెచ్యూర్‌గా సమాధానం ఇవ్వడంపై నెటిజన్లు సైతం సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Leave a Reply