Niharika Konidela | విడాకులు తర్వాత ఆపని చేద్దాం అనుకున్న కానీ ఆగిపోయాను.. నిహారిక

allroudadda.

Niharika Konidela | మెగా డాటర్ కొణిదెల నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసింది. 2020 డిసెంబర్ 9న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఇద్దరి మధ్య అనుబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. పెళ్లైన కొంత కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు.

ఇటీవల తన అన్నయ్య వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లిలో నిహారిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాక ఇప్పుడు పలు రకాల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ అమ్మడు చాలా బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోని తాజాగా ఓ మూవీ ప్రెస్ మీట్ కి వెళ్లిన నిహారిక విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విడాకులు తర్వాత తాను చాలా మనస్థాపానికి గురైనట్లుగా తెలియజేశారు.

allroudadda.
allroudadda.

అది చాలదు అన్నట్లు సోషల్ మీడియాలో నా గురించి తప్పుగా ప్రచారాలు జరగడం, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా రావడంతో మరింత కుంగిపోయినట్లుగా తెలియజేశారు. ఇక ఆ సమయంలో నాకు నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారని మరి ముఖ్యంగా మా నాన్న నన్ను ఎంతగానో దగ్గరికి చేర్చుకొని చూసుకున్నారని ఈ సందర్భంగా నిహారిక చెప్పుకొచ్చారు. మా ఫ్యామిలీ నాకు ఎంతలా సపోర్ట్ చేయడం వలన అన్ని దాటుకొని ఇప్పుడు మళ్ళీ అందరిలోకి వచ్చానంటూ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నానంటూ తెలియజేశారు.

Jaya Janaki Nayaka | సినీ చరిత్రలో బెల్లంకొండ సృష్టించిన ప్రపంచ రికార్డు ఇదే..

అయితే విడాకులు తీసుకొని తాను ఇంట్లో ఏడుస్తూ కూర్చున్న సమయంలో మా నాన్న నా దగ్గరకు వచ్చి తల్లి ఇది కాదు జీవితం అంటే… నువ్వు చూడాల్సింది చేయాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా నిహారిక చెప్పుకొచ్చారు. జీవితంలో కచ్చితంగా మనకు సపోర్ట్ గా నిలబడే భాగస్వామి ఉండాలని అలాంటి భాగస్వామి లేకపోతే మన కుటుంబ సభ్యులే ఆ బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Leave a Reply