నితా అంబానీ తాగే టీ కప్పు ధర తెలిస్తే షాకే?

ఏషియాలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ర్యాంక్ పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబందించిన విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తుంటారు.అందులో భాగంగానే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ జీవన విధానం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.20 ఏళ్ల వయసులోనే ముఖేష్ అంబానీని వివాహం చేసుకున్న ఆమె.సాంఘిక సంక్షేమ పనులలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది.

ఆమె రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ అంతేకాదు నీతా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్ కూడా.అయితే.అమే జీవన విధానం కూడా చాలా విలాసవంతంగా ఉంటుంది.నీతా లగ్జరీ లైఫ్ విషయానికొస్తే.నీతా అంబానీ పుట్టినరోజుకు భర్త ముఖేశ్ అంబానీ బహుమతిగా 240 కోట్ల ప్రైవేట్ జెట్ ఇచ్చారటా.ఇందులో ఆఫీస్‌, ప్రైవేట్ క్యాబిన్, శాటిలైట్ టెలివిజన్స్, వైర్‌లెస్ కమ్యూనికేషన్, మాస్టర్ బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌లు కూడా ఉన్నాయి.

ఇక నీతా అంబానీ జ్యువెల్లరీ కలెక్షన్స్ చూస్తే కళ్లు చెదురుతాయి.ట్రెడిషనల్ బంగారు ఆభరణాలు, వడ్డాణాలు, వజ్రాల ఉంగరాలు, హారాలు, డైమండ్ సెట్లు కోట్లు విలువ చేసే కలెక్షన్‌ ఆమె సొంతం.నీతూ చెప్పులు, బట్టల కలెక్షన్ కూడా మామూలుగా ఉండదు.ఒక్కసారి వాడితే అవి మళ్లీ వాడరని తెలుస్తోంది.ఇకపోతే ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల పెళ్లికి 40 లక్షల సారీ ధరించారట.ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ టీ కప్పులొ టీ తాగుతూ నీత అంబానీ తన రోజు ప్రారంభిస్తూ ఉంటుందట.

జపాన్ కు చెందిన పురాతన క్రోకరి కంపెనీ నోరిటేక్ ఈ టీ కప్పుల తయారు చేస్తూ ఉంటుందట. ఈ టీ సెట్ లో ఒక్కొక్కటి మూడు లక్షల పైగానే ఉంటుంది. మొత్తం టీ సెట్ ధర దాదాపు 1 5 కోట్లకు పైగానే ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఇక ఈ సెట్ లోని టీ కప్పు ప్రపంచంలోనే అత్యుత్తమ చైనా మట్టితో తయారు చేస్తారట. ఇక వీటి అలంకారం కోసం ప్లాటినంతో పూత, బంగారంతో డిజైన్ చేయడం చేస్తూ ఉంటారట. ఏది ఏమైనా ఇలాంటి టీ కప్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ ఆవుతున్నారు.

Leave a Reply