నిత్యానంద వల్ల కెరీర్ ను నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్…!!

సీనియర్ నటీనటులంతా ఇటీవల మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. కొంత మంది పాత తరం నటులు ఏమయ్యారో కూడా తెలియదు. అటువంటి వారిని వెలుగులోకి తెస్తూ.. వారితో ఇంటర్వ్యూలు చేస్తోంది సుమన్ టీవీ. తాజాగా మరో సీనియర్ నటుడు అశోక్ కుమార్‌ను అభిమానుల ముందుకు తీసుకు వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినిమాల్లో నటించారు. గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు, అందాల రాముడు వంటి సూపర్ డూపర్ హిట్స్ సినిమాలతో పాటు దాదాపు 25 సినిమా వరకు చిత్రాల్లో విలన్‌గా నటించారు.

కానీ అనూహ్యంగా ఆయన సినిమాల నుండి తప్పుకున్నారు. సినిమా నుండి తప్పుకోవడంతో పాటు నిత్యానంద ఆయన జీవితంలో సృష్టించిన అలజడి వరకు అన్ని పంచుకున్నారు. అది కాసేపు పక్కన పెడితే నిత్యా నంద గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల్లో నిత్యానంద విషయంలో భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి.

నిత్యానంద వల్ల కెరీర్ ను నాశనం చేసుకున్న హీరోయిన్లలో రంజిత కూడా ఒకరు. రంజితమొదట లవ్ మ్యారేజ్ చేసుకున్నాక. ప్రెగ్నెన్నీ వచ్చిన సమయంలో చేసిన ఆపరేషన్ వల్ల పూర్తిగా పిల్లలు పుట్టేందుకు అనర్హురాలు అయ్యిందన్నారు. అయితే ఆ తర్వాత రంజిత, ఆమె భర్త విడాకులు తీసుకున్నారు. రంజిత, నిత్యానంద పెళ్లి చేసుకున్నారని వార్తలు, ఫోటోలు వచ్చాయి. అందులో ఎంత నిజముందో తెలియదన్నారు.

అయతే ఈ విడాకుల వెనుక నిత్యానంద ప్రమేయం ఉందని అన్నారు. పెద్దకుమార్తె కూడా భర్తకు విడాకులు ఇచ్చి.. నిత్యానంద వద్దకు వెళ్లిపోయారు. మోక్షం, భక్తి వల్ల మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నామన్నారు. కానీ తాను వారిద్దరినీ తిట్టానని అన్నారు. ‘కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి.. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను’ అని తెలిపారు.

Leave a Reply