ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్… వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిన్నది ఎవరంటే.

సౌత్ సినిమా ఇండస్ట్రీలో నటి నటులకు బాగా ఫాలోయింగ్ ఉంది.అందులోను హీరోయిన్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమకు నచ్చిన హీరోయిన్ల కోసం గుడులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి తమకు నచ్చిన స్టార్స్ ఏవైనా సినిమా అప్ డేట్స్ కానీ చిన్ననాటి ఫోటోలు కానీ షేర్ చేస్తే వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు అభిమానులు.

తెలుగులో ఇప్పుడు మంచి ఫార్మ్ లో ఉన్న రష్మిక మందాన,పూజ హెడ్గే,కీర్తి సురేష్ ఇలా చాల మంది చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా లో ఈ మధ్యకాలంలో దర్శనం ఇచ్చాయి.తమిళంలో పరిచయమై.. ‘మెంటల్‌ మదిలో’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది నివేతా. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ తమిళ కుట్టి ఆ తర్వాత వరుసగా నాలుగైదు తెలుగు ఛాన్సులు కొట్టేసింది.

‘అల వైకుంఠపురంలో’, ‘విరాటపర్వం’ సినిమాల్లో మెప్పించి ఇప్పుడు విశ్వక్‌సేన్‌తో జోడీ కట్టింది. ‘దాస్‌ కా ధమ్కీ’ సినిమాతో కుర్రకారుకు తన అందచందాలతో ధమ్కీ ఇస్తున్న నివేతా పేతురాజ్‌ ముచ్చట్లు..పుట్టింది తమిళనాడులోని మధురైలో. 2015లో మిస్‌ ఇండియా ‘యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌’ టైటిల్‌ గెలుచుకున్నా. ఆ అవార్డు నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ‘ఒరు నాల్‌ కూతు’ అనే తమిళ సినిమాలో అవకాశానికి కారణమైంది.

ఆ తర్వాత సినిమాలే ప్రపంచం అయిపోయాయి.సీనియర్‌ నటి సౌందర్య అంటే ఇష్టం. చిన్నప్పుడు
ఆమె సినిమాలు బాగా చూసేదాన్ని. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే మనకు దూరమైపోయారు.ఇప్పటికైతే నా ప్రయాణం సాఫీగా, సంతోషంగా సాగిపోతున్నది. అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఆచితూచి కథలు ఎంచుకుంటున్నా. ఇతరులతో పోల్చుకోవడం కంటే.. వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఇగోలు, గొడవలు ఉండవనేది నా ఫిలాసఫీ.తమిళ సినిమాలంటే ఇష్టం.

Leave a Reply