అబ్బాయి వేషంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్న మరో అమ్మాయి..!చివరికి

అమ్మాయిల మధ్య స్నేహం అబ్బాయిల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య స్నేహం ఎలా ఉన్నా పెళ్లి మాత్రం అబ్బాయిలతోనే జరుగుతుంది. జరగాలి. ఇది ప్రకృతి ధర్మం. అలా కాకుండా వేరేలా జరిగేందుకు వీలులేదు. ఒకవేళ అలా జరిగితే దానిని పెళ్లి అనరు మరోలా అనుకుంటారు. విదేశాల్లో అబ్బాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మాములే.

కానీ, ఇండియాలో అలా కుదరదు. ఒప్పుకోరు కూడా. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటే, దానిని ఎలాగోలా ఒప్పించవచ్చు. కానీ, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటామని అంటే చూస్తూ ఊరుకోరు. దానికి కారణం కూడా ఉన్నది. సమాజం ఏమనుకుంటుందో అని భయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒప్పుకోరు. అయితే, ఇటీవలే ఓ ఇద్దరు అమ్మాయిలు ఘాడంగా ప్రేమించుకున్నారు.

ఎంతగా ప్రేమించుకున్నారు అంటే ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమతో ఒక్కరి కావాలని అనుకున్నారు. ఇరు కుటుంబాల దగ్గరకు ప్రస్తావన తీసుకొచ్చారు. మొదట వాళ్ళు చెప్పిన విషయాన్ని పెద్దలు విని షాక్ అయ్యారు. తరువాత ఒప్పుకోలేదు. సమాజం మరోలా చూస్తుందని, కుదరని చెప్పేశారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఇద్దరు ప్రేమించుకున్నారు.

కానీ, చివరకు ఇద్దరు ఓ ప్లాన్ వేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు అబ్బాయిగా మారాలని చెప్పి లింగ<< మార్పిడి చేయించుకొని అబ్బాయిగా మారిపోయారు. అమ్మాయి అబ్బాయిగా మారిపోవడంతో పెద్దలు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. చివరకు ఇటీవలే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు.. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలోని ఏంవీ గ్రామంలో జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు దేశంలో వైరల్ అవుతున్నది. బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఒకే జెండర్ వ్యక్తులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

Leave a Reply