Taj Mahal Facts | దేవుడా.. అంతా పెద్ద తాజ్ మహల్ కట్టింది ఈమె కోసమా..Taj Mahal Facts |

allroudadda

Taj Mahal Facts | నిజమైన ప్రేమకు చిహ్నంగా, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా ‘తాజ్ మహల్’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు. దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాజ్ మహల్ వెనుక చాలా మందికి తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఉన్నాయి. 1631 వ సంవత్సరంలో ఈయన చక్రవర్తిగా ఉన్న సమయంలో గొప్ప సంపదతో కూడి ఉండేది మొఘల్ సామ్రాజ్యం.

షాజహాన్ మూడో భార్యనే ముంతాజ్. ఈమె 14వ సంతానానికి అంటే గౌహర్ బేగానికి జన్మనిస్తూ మరణించింది. దీంతో షాజహాన్ చాలా విచారంగా ఉన్నారట. కొన ఊపిరితో ఉన్న ముంతాజ్ భర్తను ఓ కోరిక కోరిందట. అదేనండి ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని కనీవిని ఎరుగని సమాధిని తనకోసం కట్టించాలి అని కోరిందట. ఆ భార్య కోరిక మేరకు షాజహాన్ 1632 వ సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు.

allroudadda
allroudadda

వీరి ప్రేమకు చిహ్నంగా ఈ తాజ్ మహల్ ఎంత ప్రత్యేకతను సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వీరి టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా. అదేనండి ముంతాజ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. పైన చూశారుగా ఆమెనే షాజహాన్ భార్య ముంతాజ్. ఈ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు వామ్మో ఈమె కోసమా అంత పెద్ద సమాధిని నిర్మించింది అంటూ విస్తుపోతున్నారు.

allroudadda
allroudadda

కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ముంతాజ్ వి కావట. మరి ఈ ఫోటోలో ఉన్నది మామూలు మహిళలు ఏం కాదట. ఈ ఫోటోలో ఉన్న మహిళల పేర్తు సుల్తాన్ షాజహాన్ బేగం, బేగం సుల్తాన్ జహాన్. వీరు భోపాల్ నగరాన్నే పాలించిన మూడవ నాల్గవ బేగాలు అని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫోటోలకు ముంతాజ్ కు ఎలాంటి సంబంధం లేదు.

Recent Posts

Leave a Reply