Sr NTR 100th Birthday | ఎన్టీఆర్‌ శతజయంతి.. రూ.100 నాణెం ముద్రించిన ఆర్‌బీఐ.

allroudadda

Sr NTR 100th Birthday | తెలుగు రాష్ట్రాల్లో అటు విజయవాడ , ఇటు హైదరాబాద్‌ వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో జూనియర్, కల్యాణ్ రామ్ ఎక్కడా కనిపించలేదు. జయంతి రోజు ఎన్టీఆర్ ఘాట్‌లో (NTR Ghat) కనిపించిన ఈ ఇద్దరూ ఆ తర్వాత పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు.ఇప్పటికే నందమూరి, నారా కుటుంబ సభ్యులు దాదాపు అందరూ ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఆఖరికి తనకు ఆహ్వానం అందలేదని.. లక్ష్మీ పార్వతి కూడా గత నాలుగైదు రోజులుగా పెద్ద రచ్చే చేస్తున్నారు. తాను ఎన్టీఆర్ భార్యనని .. ఎందుకు ఆహ్వానించలేదని రాష్ట్రపతి భవన్ అధికారులను ప్రశ్నించారు కూడా. ఈ ఒక్కటే కాదు.. ఎన్టీఆర్‌కు సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లో అయినా సరే ఆయన భార్యగా తనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించుకున్నారు లక్ష్మీ పార్వతి.కాగా.. ఎన్టీఆర్‌ పేరిట నాణెం జారీ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

అల్లు అరవింద్ కు మొత్తం నలుగురు కొడుకులు అనే విషయం మీకు తెలుసా ?

దీంతో కేంద్రం ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎన్టీఆర్ నాణెన్ని (NTR Silver Coin) ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఎన్టీఆర్ శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంది. ఈ అక్షరాలు హిందీలో ముద్రించడం విశేషమని చెప్పుకోవచ్చు.

Leave a Reply