NTR – BalaKrishna | ఎన్టీఆర్‌,బాలయ్య కి మద్య గొడవకి కొడాలి నాని కారణం నిజమేనా..?

allroudadda

NTR – BalaKrishna | మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్‌(NTR) వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌పై తీవ్రంగా ఆరోపణలు చేశారు.నాడు పెద్ద ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పదవి నుంచి తప్పించగా నేడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొలగించుకునేందుకు అల్లుడు లోకేష్‌ కోసం బాలకృష్ణ పార్టీని సర్వనాశం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని విమర్శించారు.

వెయ్యిమంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూ. ఎన్టీఆర్‌ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు .ఆ సంగతి కాసేపు పక్కన పెడితే గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ కి బాలయ్య బాబు కి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేది మనం తరచుగా వార్తల్లో వింటూనే ఉన్నాం…అయితే రీసెంట్ గా చంద్రబాబు నాయుడునిపోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ వెళ్లి పరామర్శించి రాకపోవడం అనేది మరోసారి వీళ్ళ మధ్య నున్న గొడవలను గుర్తు చేస్తుంది.

allroudadda
allroudadda

అయితే అసలు వీళ్ళ మధ్య ఉన్న గొడవ ఏంటి అనేది ఒకసారి గనుక మనం చూసుకుంటే 2019 ఎలక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ ప్రచారానికి రమ్మని బాలయ్య బాబు , చంద్రబాబు ఇద్దరూ కలిసి అడగడం జరిగింది.అయినప్పటికీ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడంతో వీళ్ళ మధ్య దూరం అనేది పెరిగింది.ఇక రీసెంట్ గా సీనియర్ ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీయార్ హాజరవ్వలేదు.

 అయోధ్యకి రమ్మని ప్రధాని పిలిచారు కానీ నేనే వెళ్లలేదు. మోహన్ బాబు

హరికృష్ణ వాళ్ళ బ్రదర్ అయిన రామకృష్ణ స్వతహాగా వెళ్లి శత దినోత్సవ వేడుకలకు రమ్మని ఆహ్వానించినప్పటికీ ఆయన ఫ్యామిలీతో పాటు ట్రిప్ కు వేరే దేశం వెళుతున్నానని చెప్పి ఆ ఫంక్షన్ కి రాకుండా టూర్ కి వెళ్లిపోయాడు.అయితే వీళ్ళ ఫ్యామిలీకి ఎన్టీఆర్ (Junior NTR) దూరంగా ఉండడానికి కారణం వైసిపి పార్టీలో మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని( Kodali Nani ) చెప్తున్నట్టుగానే ఎన్టీఆర్ చేస్తున్నాడని బాలయ్య బాబు(BalaKrishna), చంద్రబాబు ఇద్దరూ కూడా ఎన్టీఆర్ పైన ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది…కానీ చంద్రబాబు ను ఎన్టీయార్ పరామర్శిస్తే బాగుండేది అని అందరూ అంటున్నారు…

Leave a Reply