మే 28న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు..! తారక్ కి నో ఇన్విటేషన్..

మహనీయుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మే 28న జరుగనున్నాయి. ఎన్టీఆర్‌ శత జయంతి సభ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ నేతృత్వంలో ‘‘ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు’’ పుస్తకావిష్కరణ జరుగనుంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తాడిగడప‌వంద అడుగుల రోడ్‌లో సభా ప్రాంగణానికి టీడీపీ నేతలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ శత జయంతి కమిటీ చైర్మన్‌ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ…

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఒక చరిత్ర సృష్టించారని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ రచించిన ‘‘ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలు & అసెంబ్లీ ప్రసంగాలు’’ పుస్తకం ఆవిష్కరణ ఉంటుందన్నారు. వెబ్‌సైట్, సావనీర్ హైదరాబాద్‌లో త్వరలోనే ఆవిష్కరిస్తామని చెప్పారు.

ఈ సభకు చంద్రబాబు , రజనీకాంత్ , బాలకృష్ణ పాల్గొంటారన్నారు. ఎన్టీఆర్‌ యాప్‌ను నారా లోకేష్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.ఐతే మరో పక్క ఈ ప్రోగ్రాం కు జూనియర్ ఎన్.టి.ఆర్ కు ఆహ్వానం అందలేదని టాక్. పెద్దాయన శత జయంతి ఉస్తవాల్లో తారక్ పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

అయితే ఎన్.టి.ఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా బిజీలో ఉండటం వల్ల ఆ ప్రోగ్రాం కు అటెండ్ అవలేకపోతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఎన్టీఆర్ శత జయంతి వేడుక అంటూ రిలీజ్ చేసిన పోస్టర్స్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వేయలేదు. తారక్ రావడం కుదరదు కాబట్టే ఆ పోస్టర్ లో అతన్ను ఉంచలేదని టాక్. ఏది ఏమైనా ఎన్టీఆర్ శత జయంతి ఉస్తవాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటే బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు.

Leave a Reply