ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ పుష్ప-2 సెట్స్‌లో జూ.ఎన్టీఆర్‌..!

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈసినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మూవీ కోసం వేసిన ప్రత్యేక సెట్ లో ఈ చిత్రీకరణ జరుగుతుంది.అయితే ఈ సెట్స్ లోకి బుధవారం (ఏప్రిల్ 26) జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ పిక్ లో ఎన్టీఆర్ ఫార్మల్ లుక్ లో కనిపిస్తున్నాడు. NTR30 షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ పుష్ప 2 సెట్ లోకి ఎందుకు వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజుకి ఎన్టీఆర్ చేసిన ట్వీట్ దానికి బన్నీ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు బన్నీ సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టడంతో ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ అభిమానులు ఆ ఫోటోను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Leave a Reply