భార్య, కొడుకులతో ఎన్టీఆర్ వెకేషన్ ట్రిప్..ఫోటోలు వైరల్‌..!

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఏ మాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు యంగ్ టైగర్ . వీలు కుదిరినప్పుడల్లాఫారెన్ ట్రిప్స్ వేస్తూ చిల్ అవుతున్నారు.హాలిడే ట్రిప్ కోసం ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌ వచ్చారు. తన భార్య లక్ష్మి ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి వేసవిలో చిల్ కావడానికి మరో ఫారెన్ ట్రిప్ కు బయల్దేరారు .

అయితే ఇది షార్ట్ వెకేషన్ ట్రిప్ అని, వారం రోజుల్లోనే ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం.ప్రస్తుతం కొరటాలశివతో కలిసి దేవర సినిమా చేస్తున్నారు . ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే భార్య, పిల్లలతో కలిసి నెల రోజుల పాటు లాంగ్ వెకేషన్ ట్రిప్ వెళ్లొచ్చారు . అమెరికాలో ఎంజాయ్ చేసి తిరిగొచ్చిన ఆయన.. కొద్దిమేర షూటింగ్ ఫినిష్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్ వేశారు.

మొదట ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో షురూ చేసి రీసెంట్ గానే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు కొరటాల. ఈ టైటిల్ పోస్టర్ చూసి నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. మరోసారి ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించనుండటంతో ఎంతో ఆతృతగా ఉన్నారు.ఈ మూవీతో బాలీవుడ్ భామ, లేట్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

Leave a Reply