1947లో పాకిస్తాన్ నుంచి భారత్ ట్రైన్ టికెట్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.

1947లో కొందరు పాకిస్థాన్ లోని రావల్పిండి నుంచి.. భారత్‌ లోని అమృత్‌సర్‌కి రైలు ప్రయాణం చేశారు. అలాంటి ప్రయాణికులకు సంబంధించిన రైల్వే టికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ టికెట్‌పై తొమ్మిది మంది పేర్లు రాసి ఉన్నాయి. ఆ తొమ్మిది మందీ ప్రయాణం చేశారు. అప్పట్లో టికెట్ ధర ఎంతో తెలుసా.. జస్ట్ 36 రూపాయల 9 అణాలు మాత్రమే. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఈ మాట అక్షర సత్యం.

పాతది ఎప్పుడైనా సరే మురిపెంగానే ఉంటుంది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రూపాయి కి వ్యాల్యూ లేకుండా పోతోంది. దీంతో ప్రజలు ముఖ్యంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు పూటలా కడుపు నిండా తినేందుకూ అష్ట కష్టాలు పడుతున్నారు. దీంతో పాత రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండు అని అనుకుంటుంటారు చాలా మంది.

నిజానికి కొన్నేళ్ల క్రితం ధరలు చాలా తక్కువగా ఉండేవి. అప్పటి పరిస్థితులను బట్టి ధరలు ఉన్నా.. అవి ఇప్పుడు మనకు చాలా తక్కువ అనిపిస్తాయి. పది రూపాయలతో నెలకు సరిపడా సరకులు కొనుక్కునే వాళ్లంటే అతిశయోక్తి లేదు. అదే.. ఇప్పుడు పది రూపాయలకు కనీసం సింగిల్ టీ కూడా రాదు. దీంతో చాలా మంది అప్పటి ధరలు.. ఇప్పటి ధరలను పోలుస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు.

76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్‌ ఉంది. పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వెళ్లే ఓ పాత టిక్కెట్‌ అది.1947 లో ఈ టిక్కెట్ తీసుకున్నారు. ఓ కుటుంబం పాకిస్తాన్‌లోని రావల్పిండి నుంచి భారత్ లోని అమృత్‌సర్‌ ప్రయాణించడానికి కేవలం 36 రూపాయాల తొమ్మిది అణాలు చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేశారు. అంటే.. ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ.4. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ నుంచి భారత్ కు ప్రయాణం చేసేందుకు కేవలం రూ.4 సరిపోతుందన్న విషయం తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply