Pallavi Prashanth | నన్ను సీఎంని చెయ్యండి..అందరికీ సహాయం చేస్తా..

allroudadda

Pallavi Prashanth | ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు విధ్వంసానికి పాల్పడ్డారని.. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు కేసులు నమోదు చేశారు. అభిమానులు రెచ్చిపోవడానికి ప్రశాంతే కారణం అంటూ అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.ఇక, పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసుల విధులకు ప్రశాంత్ ఆటంకం కలిగించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

ప్రశాంత్ కారణంగానే యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టడంతో వాహనాలు ధ్వంసం చేశారని అన్నారు.దానితో సోమవారం రాత్రి పోలీసులు ప్రశాంత్ ని అరస్ట్ చేశారుకాగా నేడు పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడికి సైతం బెయిల్ మంజూరు చేసింది.

నన్ను సీఎం చేస్తానంటే చెప్పండి..

Pallavi Prashanth | అది పక్కన పెడితే బిగ్ బాస్ టైటిల్ కొట్టిన ప్రశాంత్.. తనకి వచ్చిన ప్రైజ్ మనీ రూ.35 లక్షలు రైతులకు ఖర్చు చేస్తానని మాట ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్‌‌లో ఉన్నప్పుడే కాదు.. వెళ్లక ముందు కూడా అదే మాట చెప్పాడు ప్రశాంత్. తాను బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన అమౌంట్‌ని రైతులకే ఖర్చు చేస్తానని అన్నాడు ప్రశాంత్. టైటిల్ గెలిచిన తరువాత కూడా.. తనకి వచ్చిన రూ.35 లక్షల్ని రైతుల కోసమే ఖర్చు చేస్తానని అన్నాడు. అయితే ప్రశాంత్ విన్నర్ అయిన తరువాత.. రైతుల్ని ఆదుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read | పెళ్లి చేసుకోబోతున్న ఆకాశ్ పూరి.. అమ్మాయి ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా..

మీరు రైతు బిడ్డగా వెళ్లి బిగ్ బాస్ టైటిల్ గెలిచారు కదా.. ఇక్కడ మల్లన్న సాగర్ ఉంది.. ఇక్కడ 14 గ్రామాల రైతులు ఇబ్బంది పడుతున్నారు? గతంలో వాళ్ల కోసం ఏమైనా చేశారా? అని ఓ రిపోర్టర్ ప్రశ్న వేయడంతో.. ‘నాకు ఏమైనా సీఎం పదవి ఇచ్చారా? నేను రైతు బిడ్డని అంతే. మాట్లాడితే కాస్త అర్ధం ఉండాలి. నన్ను సీఎం చేస్తానంటే చెప్పండి..

ఆ రైతుల్ని ఆదుకుంటా.. నేనేమైనా పదవిలో ఉన్నానా?? లేదంటే సీఎంనా? మామూలు రైతుని. నాకు వచ్చిన డబ్బుని రైతులకు ఇస్తానంటే.. 14 ఊర్లు పోయాయి వాళ్లకేం చేస్తారని అంటున్నారు. వాళ్లకి నేనేం చేస్తా.. నేనో రైతు బిడ్డని. మీ ఛానల్ ద్వారా నన్ను సీఎంని చేయండి.. ఆ 15 ఊర్లను ఆదుకుంటా.. లేదంటే నాకు ఏదైనా మంచి పదవి ఇవ్వండి.. ఆ రైతుల్ని ఆదుకుంటా’ అని అన్నాడు ప్రశాంత్.

Also Read | నిహారిక మళ్లీ పెళ్లి చేసుకున్నా విడాకులు తప్పవు.. వేణుస్వామి సంచలన కామెంట్స్.

Leave a Reply