Pallavi prashanth | చంచల్ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్‌.. ఎన్ని రోజులో తెలుసా,

allroudadda

Pallavi prashanth | పల్లవి ప్రశాంత్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా దాదాపు నాలుగు నెలలుగా అటు టీవీల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఇతగాడి పేరు మారుమ్రోగిపోతోంది.దీనికి కారణం కామన్ మ్యాన్‌ కోటాలో బిగ్ బాస్ షోలోకి వచ్చి.. అసాధారణ ఆటతీరుతో విజేతగా నిలవడమే అని తెలిసిందే.అంత వరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ పోలీసు కేసులో చిక్కుకున్నాడు. దీంతో గత రాత్రే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరో వైపు.. బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవ పై మరో 16 మంది అరెస్టు చేశారు పోలీసులు. బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని గుర్తించారు. ఇందులో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లు అరెస్టు చేశారు. అయితే కాసేపటి క్రితం జడ్జ్ ఇంట్లో.. రిమాండ్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరిపిన తర్వాత పల్లవి ప్రశాంత్‌ను స్థానిక మెజిస్టేట్ జడ్జి ఇంట్లో హాజరు పరిచారు.

allroudadda
allroudadda

మూడేళ్ల వరకూ జైలు శిక్ష ..

అతడితో పాటు సోదరుడిని సైతం అక్కడకు తీసుకు వెళ్లారు. ఈ క్రమంలోనే జడ్జ్ పల్లవి ప్రశాంత్‌తో పాటు అతడి సోదరుడికి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్‌ను విధించారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు మీడియాకు వెళ్లడించారు.ఇదిలా ఉండగా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అతడిపై 427 సెక్షన్ పైన కేసు నమోదు చేశారు. ఇందులో నేరం చేసినట్లు రుజువు అయితే పల్లవి ప్రశాంత్‌కు మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Also Read | హీరోయిన్ అంజలి లైఫ్ లో ఇంత బాధకరమైన విషాదమా.?

Leave a Reply