Pallavi Prashanth | బ్రేకింగ్ న్యూస్.. పరారీలో బిగ్‌బాస్‌ పల్లవి ప్రశాంత్‌..! ఏం జరిగింది అంటే..?

allroudadda

Pallavi Prashanth | ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్-7 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపలకు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ పేరు ప్రకటించగానే అతడి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఇరువురి అభిమానుల మధ్య గొడవ మొదలైంది. అది దాడులకు దారితీసింది.

ఒకరినొకరు తోసుకుంటూ గట్టిగా కొట్టుకున్నారు.అదే సమయంలో అటుగా వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ చెందిన ఆరు బస్సులపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు అభిమానులు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు.

allroudadda
allroudadda

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. Pallavi Prashanth

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కారు నడిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు కేసులు పెట్టగా ఒక దాంట్లో పల్లవి ప్రశాంత్ పేరు కూడా చేర్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నాన్ బెయిలబుల్ కావడంతో ప్రశాంత్ పరారీ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a Reply