బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఆస్తుల విలువ తెలిస్తే షాక్..!

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా అందరికీ సుపరిచితమే. ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చడ్డాని వివాహం చేసుకోబోతున్న సంగతి కూడా ఈ మధ్యనే బయటపడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రైవేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవుతున్నాయి కూడా..! ప్రముఖ సినీ రాజకీయ నాయకుల సమక్షంలో ఎంతో ఘనంగా ఢిల్లీలో వీరి నిశ్చితార్థం జరిగింది.

పరిణితి సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా.. రాఘవ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా రాజకీయాలలో కొనసాగుతున్నారు. అయితే పొలిటీషియన్ కాబట్టి రాఘవ చడ్డాకి ఎక్కువ ఆస్తి ఉండుంటుంది. అందుకే పరిణితి కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు.నీ వాస్తవానికి రాఘవ్ కంటే కూడా పరిణితికే ఎక్కువ ఆస్తి ఉందని బి టౌన్ టాక్.

అందుతున్న సమాచారం ప్రకారం.. పరిణితి చోప్రాకి రూ.160 కోట్ల పైనే ఆస్తులు ఉన్నాయంట. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు.అయితే ఈ మధ్య ఈమె హవా కాస్త తగ్గింది.ఇక రాఘవ చడ్డా ఆస్తులు, స్థిరాస్తుల విలువ కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. అయితే రాఘవ్ కు బ్లాక్ మనీ చాలా ఉంటుంది. పైకి మాత్రం అసలు లెక్కలు చెప్పరు అని కూడా ముంబై లో ఉన్న మీడియా సభ్యులు అంటున్నారు.

Leave a Reply