Naresh : పవిత్రా లోకేష్ తో అలా చేస్తే తప్పేంటి?..నరేష్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ లో ప్రస్తుతం పవిత్ర లోకేష్ అంటే తెలియని వారు ఉండరు రవితేజ దొంగోడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పవిత్ర లోకేష్ తల్లి పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆమె తెలుగులో ఇప్పటికే చాలా చిత్రాలలో నటించింది. కాని నటిగా పవిత్ర లోకేష్ కి వచ్చిన గుర్తింపు కంటే సీనియర్ యాక్టర్ నరేష్ తో ప్రేమ వ్యవహారంతో అందరి దృష్టిలో పడింది.

ఇదిలా ఉంటే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ జంటగా మళ్ళీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వీరిద్దరి నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితోనే మళ్ళీ పెళ్లి సినిమాని తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. అయితే పవిత్ర లోకేశ్ తో పెళ్లి, పిల్లల గురించి నరేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

పవిత్రా లోకేశ్ పిల్లల్ని కనడంలో ఎలాంటి తప్పు లేదనే విధంగా స్పందించగా నరేష్ మాట్లాడుతూ తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్ గా ఉన్నామని కామెంట్లు చేశారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనని నరేష్ పేర్కొన్నారు. తన దృష్టిలో బ్లడ్ రిలేషన్ షిప్ తో పోల్చి చూస్తే ఎమోషనల్ రిలేషన్ షిప్ అనేది ముఖ్యమని నరేష్ వెల్లడించారు.

విజయనిర్మలకు, పవిత్ర లోకేశ్ కు పోలికలు ఉన్నాయని ఆయన తెలిపారు. తన తల్లి కళ్లు, పవిత్రా లోకేశ్ కళ్లు ఒకే విధంగా ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా గడుపుతామని నరేష్ అన్నారు. నరేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర, నరేష్ పిల్లల్ని కనాలని భావిస్తున్నారని వాళ్ల కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.

Leave a Reply