Pawan Kalyan | పొత్తులపై పవన్ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు..

allroudadda

Pawan Kalyan | తెలుగుదేశం,జనసేన మొదటి జాబితా ప్రకటించారు. టిడిపి 94, జనసేన అభ్యర్థులు ఐదుగురు పేర్లను వెల్లడించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల్లో అసంతృప్తులు వ్యక్తం అయ్యాయి. చాలామంది నేతలు బాహటంగానే తమ సంతృప్తిని వెళ్ళగక్కారు. మరోవైపు జనసేనకు తక్కువ అసెంబ్లీ స్థానాలు కేటాయించారని ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. అటు కాపు సామాజిక వర్గం సైతం ఆగ్రహంగా ఉంది. కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఇలా అయితే కాపు ఓట్లు కూటమి అభ్యర్థులకు బదిలీ కావని తేల్చి చెప్పారు. జనసేన సీట్లు పెరగాల్సిందేనని తేల్చి చెప్పారు. మరో పక్క ఎక్కువ సీట్లు తీసుకొని ప్రయోగాలు చేసే బదులు తక్కువ సీట్లు తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. 24 స్థానాలు అయినప్పటికీ 98% అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.జనసేన 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారని,

allroudadda
allroudadda

అయితే గత ఎన్నికల్లో జనసేనకు కనీసం పది స్థానాలు గెలిపించి ఉంటే ఇప్పుడు స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పోటీ చేసే స్థానాలు 24 మాత్రమే కనిపిస్తున్నాయని, మూడు లోక్ సభ స్థానాలు పోటీ చేస్తుండడం వలన 40 స్థానాలు పోటీ చేస్తున్నట్లే లెక్క అని అభిప్రాయపడ్డారు. జనసేన పోటీ చేసేది 24 స్థానాలు అని తెలిసినప్పటినుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ మాత్రం దానికి ఇంత తతంగం నడపడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. సొంతంగా పోటీ చేస్తే సరిపోతుంది కదా పొత్తు ఎందుకని అభిప్రాయపడుతున్నారు.పోటీ చేసేది 24 స్థానాల్లో అయినా మూడు లోక సభ స్థానాల్లో పోటీ చేస్తుండడం వల్ల మొత్తం 40 స్థానాల్లో పోటీ చేసినట్టు లెక్క అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం పైన కూడా జనసైనికులు విమర్శలు చేస్తున్నారు. మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేసినంత మాత్రాన 40 స్థానాల్లో పోటీ చేసినట్లు ఎలా అవుతుందని వారు పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారు

Leave a Reply