Pawan Kalyan | నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్.. రా పోదాం.. పవన్ కళ్యాణ్

allroudadda

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, జగన్‌ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం అని అన్నారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కళ్యాణేకాదంటూ హెచ్చరించారు. పొత్తులో భాగంగానే 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించిందని అన్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారనీ.. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో తెలుస్తుందన్నారు.

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని.. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని అన్నారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నా తపన మీరు బాగుండాలనే.. అయితే యుద్ధ తంత్రం గురించి, పోల్ మేనేజ్ మెంట్ గురించి మీకేం తెలుసు? అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా? మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అందుకే 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు ఒప్పుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

allroudadda
allroudadda

నన్ను నమ్మండి… వ్యూహం నాకు వదిలేయండి… నేను మీకోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు. నన్ను నమ్మి నడుస్తున్న జనసైనికులు, వీర మహిళలు, యువత… నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును నమ్మి నడుస్తున్న తెలుగు తమ్ముళ్లు, తెలుగు మహిళలు అందరూ కలిసి మహా యుద్ధంలో పాల్గొందామన్నారు.అలాగే తనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి వాస్తవమే.. అందులో రెండు విడాకులు అయ్యాయి. అయితే.. జగన్ మాత్రం తనకు నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని పరచటం చేస్తున్నారని అన్నారు. తనకు నాలుగో పెళ్ళాం ఎవరో అర్థం కావడం లేదని.. బహుశా తన నాలుగో పెళ్ళాం సీఎం జగనే కావచ్చు అంటూ చురకలు అంటించారు.

Leave a Reply