Pawan Kalyan | పిఠాపురం నుండే రాజకీయ దశ మారుస్తా..

allroudadda

Pawan Kalyan | ‘‘సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయమని కొందరు, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలని మరికొందరు కోరుతున్నారు. నాకు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. దత్తాత్రేయుడి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్రమైన నేలగా పేరుగాంచిన పిఠాపురం నుంచి పోటీకి నిలబడుతున్నాను’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పవన్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరదించారు.ఈ నేపద్యంలో మంగళవారం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పిఠాపురం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గమని.. ఇక్కడి నుండి పోటీ చేయడం నా అదృష్టమని అన్నారు. పిఠాపురం నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు ఈ సందర్భంగా జనసేనాని ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం నుంచే ఏపీ దశ మారుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం కీలకమైందన్నారు. 2019 ఎన్నికల్లోనే పలువురు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయమంటే ఆలోచించానని గుర్తు చేశారు.

allroudadda
allroudadda

పిఠాపురాన్ని ఒక నియోజకవర్గంగా చూడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులాల ఐక్యత జరగాలని.. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ ఆకాంక్షించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇందులో ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఫిక్స్ చేసిన పవన్.. మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక ఫోకస్ పెట్టారు.

Recent Posts

Leave a Reply