Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో జనసేన ..

allroudadda

Pawan Kalyan | రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సినిమాల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం జనసేనకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ జనసేన అధికారంలోకి వస్తే విలవిలలాడుతున్న విశాఖను కాపాడతామని ఏయూను ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్ల వ్యవస్థను సరి చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీని ఓడిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జనసేన మాత్రమే అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.

allroudadda
allroudadda

వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిగా ఉంటాననే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. అయితే పవన్ కామెంట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక మరో పార్టీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నలకు జవాబు దొరకాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు. పవన్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Leave a Reply