kalyan: జనసేన కార్యకర్తను చెంపదెబ్బ కొట్టిన పోలీస్.. పవన్ రియాక్షన్ మామూలుగా లేదుగా..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన Janasena Party శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. తమ అధినేత పవన్ కల్యాణ్ Pawan kalyan ను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జనసైనికులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం దిష్టిబొమ్మ దహనానికి వారు యత్నించారు. అయితే దిష్టిబొమ్మ దహనానికి తాము అనుమతించబోమని సీఐ అంజు యాదవ్ వారికి చెప్పారు.

అయినప్పటికీ వారు దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో ఒక నేత చెంపలపై ఆమె కొట్టారు. ఈ ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మహిళా సీఐ తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలగే ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ Pawan kalyan స్పందించారు. శాంతియుతంగా ధర్నా చేస్తు ఎందుకు కొట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి తేల్చుకుంటానని స్పష్టం చేశారు.

అలాగే Janasena Party జనసేన పార్టీపై ఇటీవల వైసీపీ నేతలను ఆరోపణలను కూడా పవన్ ఖండించారు. టీడీపీ పార్టీకి జనసేన బీ టీం అంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే వాళ్ల ఆరోపణలను పవన్ కల్యాణ్ కొట్టి పారేశారు. మరోవైపు ప్రజలకు సేవ చేసేందుకు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండగా.. మళ్లీ గ్రామ వాలంటీర్లు ఎందుకు అని ప్రశ్నించారు.

Leave a Reply