ఇండస్ట్రీలో మరో విషాదం. అనారోగ్యంతో స్టార్ యాక్టర్ మృతి.

పింటు నంద.. గత కొంత కాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన పరిస్థితి నానాటికీ విషమిస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఇక్కడ ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే బుధవారం రాత్రి ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఒరియా నటుడు పింటు నంద కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‏లో తుదిశ్వాస విడిచారు.

కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మొదట్లో భువనేశ్వర్‏లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను కాలేయ మార్పిడి కోసం న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)కి తరలించి చికిత్స అందించారు. అక్కడ అవయవదాత అందుబాటులో లేకపోవడంతో.. ఆయనను ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

బుధవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.నంద మృతితో సినీ పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. నంద మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. హీరోగా, ప్రతినాయకుడిగా, సహయ నటుడిగా, హాస్యనటుడిగా ఒరియా సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు నంద. బుల్లితెరపై కూడా ఫేమస్ అయ్యారు నంద. 1996లో కోయిలి చిత్రంతో అరంగేట్రం చేశారు నందా. దోస్తీ, హట ధారి చాలు తా, రుంకు ఝుమానా , రాంగ్ నంబర్, ప్రేమ రుతు అసిగల చిత్రాల్లో నటించారు.

Leave a Reply