PM Modi | ఈ వయస్సులో దేవుడి కోసం సముద్రంలో ప్రధాని మోదీ సాహసం..

allroudadda

PM Modi | గత నెల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటూ సాహసోపేతమైన స్నార్కెలింగ్ కూడా (స్విమ్మింగ్) చేశారు. సముద్ర తీరాన కాసేపు కూర్చుని సేద తీరారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘లక్షద్వీప్ సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రజల కోసం నేనింకా ఎంతో కష్టపడి పనిచేయాలని ఈ వాతావరణం నేర్పింది. సాహసాలు చేయాలనుకునే వారు..మీ జాబితాలో లక్షద్వీప్‌ను కూడా చేర్చండి’’ అని మోదీ అన్నారు.

ఇది ఎంతో అందమైన అనుభవం అని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు. అది పక్కన పెడితే తాజాగా ద్వారకలో ద్వారకాదీశ్‌ (శ్రీకృష్ణుడి) ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపిన మోడీ సముద్ర గర్భంలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు. నీటి అడుగులోకి వెళ్లి.. మునిగిపోయిన ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో పూజలు చేశారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు.

allroudadda
allroudadda

డైవింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఆధ్వర్యంలో డైవింగ్‌ చేసి సముద్ర గర్భంలోని ద్వారకను సందర్శించారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంగా ద్వారకను పేర్కొంటారనే విషయం తెలిసిందే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సముద్ర గర్భంలోని ద్వారకకు వెళ్లిన ప్రధాని మోదీ నెమలి పింఛాలను, పూజా సామాగ్రిని తీసుకెళ్లి పూజలు నిర్వహించారు.అంతకు ముందు ప్రధాని మోదీ ద్వారకాధీష్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి హిందూ సంప్రదాయంలో కాషాయం దుస్తులు ధరించి, మూడు నామాలు పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణతో కనిపించారు.

ఇక ద్వారకకు వచ్చే భక్తులకు ప్రధాని మోదీ సర్‌ ప్రైజింగ్‌ గిఫ్టు ఇచ్చారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని బైట్‌ ద్వారక ద్వీపాన్ని కలిపే సుదర్శన్‌ సేతును ఆయన ప్రారంభించారు. సుమారు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ కేబుల్‌ బ్రిడ్జి పొడవు 2.32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ తీగల వంతెన దేశంలోనే అత్యంత పొడవైనది.ఈ వంతెనకు రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడు జీవితంలో ప్రత్యేక ఘట్టాలను చెక్కారు. అలాగే తీగల వంతెనపై సోలార్‌ విద్యుత్‌ ను ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్‌ ను సైతం ఏర్పాటు చేశారు.

Leave a Reply