Free Electricity | ఉచిత కరెంట్‌ కావాలంటే ఇలా చేస్తే చాలు..

allroudadda

Free Electricity | దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. సోలార్‌ పవర్‌ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.ఈ పథకంలో ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందించనున్నట్లు తెలిపారు.ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ప్రోత్సహించాలని మోదీ అన్నారు. అదే సమయంలో, ఈ పథకం మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని చెప్పారు.ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఇందుకోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకుందాం.

allroudadda
allroudadda

సోలార్ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే?

pmsuryaghar వెబ్‌సైట్‌లో ‘Apply for rooftop solar’కి వెళ్లండి.
ఈ పోర్టల్ వెబ్‌సైట్లో మీ పేరును రిజిస్టర్ చేసుకోండి.
మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి.
ఆపై పోర్టల్‌లో పూర్తి వివరాలను ఎంటర్ చేయండి.

allroudadda
allroudadda

మీ విద్యుత్ కన్జ్యూమర్‌ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాలి.
ఇమెయిల్‌ ఐడీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మీ కన్జ్యూమర్‌ నంబర్ & మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.
ఫారమ్ ప్రకారం.. రూఫ్‌టాప్ సోలార్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి
(DISCOM) నుంచి ఆమోదం వచ్చేంత వరకు వేచి ఉండాలి.

ఆమోదం పొందిన తర్వాత మీ DISCOM నమోదిత విక్రేతల ద్వారా సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.
నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డిస్కం అధికారులు వచ్చి తనిఖీ చేస్తారు.
ఆ తర్వాత అధికారులు పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్‌ను మీకు అందిస్తారు.
మీరు కమీషన్ నివేదికను స్వీకరించిన తర్వాత పోర్టల్ ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలను క్యాన్సిల్డ్ చెక్కును సమర్పించండి.
ఈ స్కీమ్ కింద పొందిన సబ్సిడీ 30 రోజుల్లోగా మీ బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ అవుతుంది.

Leave a Reply