PM YASASVI | విద్యార్థుల లక్ష రూపాయల ఉచిత స్కాలర్‌షిప్‌ స్కీమ్‌.. ఇలా అప్లయ్‌ చేసుకోండిPM YASASVI |

allroudadda

PM YASASVI | YASASVI స్కాలర్‌షిప్‌ పథకం అనేది ఇతర వెనుకబడిన తరగతి (OBC), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC), నాన్-షెడ్యూల్డ్, ఖనబ్డోస్ , సెమీ- నోమాడిక్ ట్రైబ్స్ (DNT/SNT) వర్గాలకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడింది. 9వ తరగతి లేదా 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ స్కీం ఏర్పాటు చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించని వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌కి ఎంపికైన వారికి ఏడాదికి రూ.75,000 నుంచి రూ.1, 25,000 వరకు ఉంటుంది.మెరిట్ ఆధారంగా 2023 సంవత్సరంలో ఈ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే, దీనికి ముందు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. కాబట్టి, మరింత సమాచారం కోసం NTA వెబ్‌సైట్ https://yet.nta.ac.in/ని సందర్శించండి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

పీఎం యశస్వీ స్కాలర్‌షిప్‌ను వెనుకబడిన తరగతి (OBC), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC), సంచార, పాక్షిక-సంచార జాతులు,డీనోటిఫైడ్ తెగలకు చెందిన 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతిభావంతులైన విద్యార్థులు పొందవచ్చు. ఇందుకు కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి. స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

-పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ పథకం కోసం, మీరు Social justice and empowerment వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

-ఇప్పుడు మీరు హోమ్ పేజీకి వెళ్లి PM యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

-ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇక్కడ నమోదు చేసుకోండి. SMS ద్వారా ఫోన్‌కు రిజిస్ట్రేషన్ నంబర్,పాస్‌వర్డ్ వస్తుంది.

-ఇప్పుడు పూర్తి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, అవసరమైన అన్ని పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

-మీ దరఖాస్తు ఫారమ్ ఆమోదించబడుతుంది

Leave a Reply