సోషల్ మీడియాని ఊపేసిన పూజా హెగ్డే డ్యాన్స్! ఇలా సినిమాల్లో కూడా ఇలా చూసి ఉండరు..

టాలీవుడ్ మోస్ట్ గార్జియస్ బ్యూటీ పూజా హెగ్డేకి సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్స్ 8వ ఎడిషన్ అవార్డ్ షో 21, 22వ తేదీల్లో చెన్నై ఐలాండ్ బీచ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మన టాలీవుడ్ బుట్ట బొమ్మ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాదాపు 9 నిమిషాల పాటు కంటిన్యూగా తాను నటించిన సినిమా సాంగ్స్ కి స్టెప్పులేసింది.

దీనికి సంబంధించిన వీడియోను బిహైండ్ వుడ్స్ నిర్వాహకులు తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.“నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు” అనే సాంగ్ తో.. రెడ్ కలర్ డ్రస్ లో స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. రెడ్ కలర్ డ్రస్ లో పూజా అలా కనపడగానే చూసే వారి కళ్ళు జిగేలుమంటాయి. అంత ముగ్ధ మనోహరంగా ముస్తాబై వచ్చింది బ్యూటీ.బుట్ట బొమ్మ సాంగ్ తో మొదలుపెట్టి..

అరబిక్ కుత్తు, సీటీమార్, రాములో రాముల వంటి సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ అక్కడున్న వేలాది అభిమానులను ఉర్రూతలూగించింది. అరబిక్ కుత్తు సాంగ్ కి డ్యాన్స్ వేస్తున్నంతసేపూ ప్రాంగణం మొత్తం విజిల్స్ తో దద్దరిల్లిపోయింది. అరబిక్ క్వీన్ వీడియో చూసి అభిమానులు మాత్రం పిచ్చెక్కిపోతున్నారు. ఇరగదీశావ్ పూజా బేబీ, నీ ఎనర్జీకి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply