కమల్‌తో తనకున్న సంబంధంపై నటి పూజా కుమార్ క్లారిటీ…!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి విశ్వ నటుడుగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్ (. ఈయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే. ఇంతలా క్రేజ్ ఉండడానికి కారణం కమలహాసన్ తన నటన తో చూసే వాళ్ళందరికీ పిచ్చెక్కిస్తారు. కేవలం ఈయనకు మామూలు జనాల్లో అభిమానులే కాదు సెలబ్రిటీ లలో కూడా ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక ఈయనతో ఎవరైనా హీరోయిన్ నటిస్తే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.

ఇప్పటికీ ఇంత వయసు వచ్చినా కూడా చాలామంది హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు ఇరగదీస్తాడు.ఇక విషయంలోకి వెళ్తే.. కమలహాసన్ 1960 లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఏడుపదుల వయసుకు దగ్గరవుతున్న కూడా యంగ్ హీరోలకి దీటుగా తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే వచ్చిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం కమలహాసన్ చేతిలో భారతీయుడు 2అనే సినిమా ఉంది.ఇక కమలహాసన్ గురించి నెట్టింట్లో ఒక వార్త తెగచక్కర్లు కొడుతుంది. అదేంటంటే కమల్ హాసన్ ఓ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కమలహాసన్ హీరోయిన్ పూజ కుమార్ తో ఇప్పటికే వరుస సినిమాలో నటించారు.ఇక ఆ సినిమాల్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ లో వీళ్ళిద్దరూ లీనమైపోయి చేశారు.

దాంతో వీళ్ళు బయట కూడా అంతే క్లోజ్ గా ఉండడంతో వీరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే తాజాగా వీళ్ళిద్దరూ దిగిన ఓ ఫోటో కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో వీరిపై అనుమానాలు మరింత పెరిగాయి. ఇక ఈ విషయంపై నటి పూజా కుమార్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నేను హీరో కమల్ హాసన్ గారితో దాదాపు ఐదేళ్ల నుండి సినిమాల్లో నటిస్తున్నాను. నాకు ఆయన ఫ్యామిలీతో కూడా మంచి బాండింగ్ ఉంది.

అందువల్లే మా మధ్యన ఇలాంటి ఎఫైర్ వార్తలు వస్తున్నాయి.కానీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మా మధ్యన అలాంటివి ఏమీ లేవు. దయచేసి మీరు ఎవరు అలాంటి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి రాయొద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ హీరోయిన్ ఇంత మంచిగా క్లారిటీ ఇచ్చినప్పటికి కూడా చాలామంది మాత్రం ఈ వార్తలు ఆపడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కమలహాసన్ వాణి గణపతి, సారిక, గౌతమి లతో సహజీవనం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే పూజ కుమార్ తో కూడా ఇలాంటి రిలేషనే ఉంది కావచ్చు అని అందరూ భావిస్తున్నారు.

Leave a Reply