allroudadda

Poonam Pandey | పబ్లిసిటీ కోసం అలా చెప్పాను..కానీ నేను బతికే ఉన్నాను

Poonam Pandey | పూనమ్‌ పాండే ప్రముఖ మోడల్‌. 2013లో తొలిసారిగా ఆమె నషా అనే హిందీ చిత్రంలో నటించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచేవారు. 2011 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా టీమిండియా ఫైనల్లో గెలిస్తే నగ్నంగా కనిపిస్తానని ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె చివరగా.. నటి కంగనారనౌత్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘లాక్‌ అప్‌’ మొదటి సీజన్‌లో కనిపించారు. షోలో విజయం సాధించలేకపోయినప్పటికీ అభిమానుల సంఖ్యను పెంచుకున్నారు.

2020లో శామ్‌ బాంబేను వివాహం చేసుకున్న పూనమ్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే.. వారి వైవాహిక జీవితం ఎంతోకాలం కొనసాగలేదు. పెళ్లయిన కొద్దిరోజులకే శామ్‌పై ఆమె గృహ హింస ఆరోపణలు చేశారు. తర్వాత విడిపోయారు.ప్రముఖ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే అకాల మరణం చెందారు. కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న 32 ఏళ్ల పూనమ్‌ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్‌ శుక్రవారం ఉదయం ధ్రువీకరించారు.

allroudadda
allroudadda

‘ఈ రోజు చాలా బాధకర విషయాన్ని తెలియజేయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాము. మన ప్రియతమ నటి పూనమ్‌ పాండే గర్భాశయ కేన్సర్‌తో గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషాద సమయంలో ఆమెను స్మరించుకుంటూ.. వారి కుటుంబ గోప్యతకు భగం కలిగించవద్దని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. అయితే మరణానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి ఆమె కుటుంబం అందుబాటులో లేదు.

ఆమ్మో: అప్పుడే భర్తను దూరం పెడుతున్న నయనతార..!

తాజాగా పూనమ్ పాండే నుంచి ఒక షాకింగ్‌ మెసేజ్‌ వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ పోస్ట్‌ పెట్టింది పూనమ్. తనకు ఎలాంటి క్యాన్సర్‌ లేదని పేర్కొంది. సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌) గురించి అవగాహన కల్పించడం కోసమే అలా చేశానని వీడియో రిలీజ్ చేసింది. Also Read – యాత్ర 2.. నేను విన్నాను.. నేను ఉన్నాను.. “మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను. నేను బతికే ఉన్నాను.

allroudadda
allroudadda

గర్భాశయ క్యాన్సర్‌తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళలు చనిపోయారు” “కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది. HPV వ్యాక్సిన్‌ ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కోవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు వైద్యశాస్త్రంలో ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్‌ విషయంలో ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దాం” అని పూనమ్‌ పాండే తెలిపింది.

Leave a Reply