Poonam Pandey | ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హీరోయిన్ మృతి..

Poonam Pandey | ప్రముఖ మోడల్, సినీ నటి పూనమ్ పాండే హఠాన్మరణం పాలయ్యారు. కొంతకాలంగా గర్భాశయ(సర్వికల్) క్యాన్సర్ తో బాధపడుతున్న పూనమ్ పాండే ఈ రోజు ఉదయం ఉత్తర ప్రదేశ్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూనం పాండే పీఆర్ టీం ఒక ప్రకటనలో వెల్లడించింది. 32 ఏళ్ల పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్ తో పోరాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని పూనం పాండే టీం ఆమె ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.

తామేంతో అభిమానించే పూనమ్ పాండే ఇక లేరని చెప్పేందుకు తాము ఎంతో బాధపడుతున్నామని ఆమె పీఆర్ టీం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తనను అభిమానించే ప్రతి వ్యక్తిని ప్రేమించే పూనమ్ పాండే ఇక లేరు అని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని అన్నారు. ఈ బాధాకరమైన సమయంలో తాము గోప్యతను కోరుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

allroudadda
allroudadda

బాలీవుడ్, కన్నడ, తెలుగు, సినిమాలలో పూనమ్ పాండే నటించారు. కొన్ని టీవీ షోలలో కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా ఆమెకు గుర్తింపు ఉంది. 2011లో టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే తాను న్యూడ్ షో చేస్తానని పూనం పాండే చేసిన కామెంట్ తో ఆమె పేరు ఒక్కసారిగా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. పూనమ్ పాండే మరణ వార్త తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.

Leave a Reply