పోసాని కృష్ణ మురళికి మూడోసారి కరోనా..! షాక్ లో ప్రముఖులు

తెలుగు సినీ ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఙాశాలికి పేరుపొందిన నటుడు పోసాని కృష్ణ మురళి. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పోసాని ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తాజాగా పోసాని కృష్ణమురళికి మరోసారి కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో పోసాని కృష్ణమురళి చికిత్స పొందుతున్నారు. ఇటీవల పూనేలో ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొని వచ్చిన పోసాని కృష్ణమురళికి ఒంట్లో నలతగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.పోసాని ఇది వరసగా మూడోసారి కరోనా సోకిందని చెప్పారు.

ఇటీవల భారత్ లో కేసుల సంఖ్య పెరుగుతుంది. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరిస్తూ భౌతికదూరం పాటించాలని కోరుతున్నారు. తెలంగాణలోనూ నిన్న 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోనే 18 కొత్త కేసులు నమోదయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు.

Leave a Reply